గౌతమ్ కృష్ణకి సపోర్ట్ చేస్తున్న షకీల!
on Sep 20, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్స్ మధ్య జరిగే గొడవలు కామన్. హౌజ్ లో వారం మొత్తం ఎలా ఉన్న సోమవారం జరిగే నామినేషన్లో హీటెడ్ ఆర్గుమెంట్స్ జరుగుతుంటాయి. ఆదివారం ఎలిమినేషన్ ఉంటుంది. ఇప్పటికే హౌజ్ లో కిరణ్ రాథోడ్, షకీల ఎలిమినేట్ అయ్యారు.
షకీ అమ్మగా బిగ్ బాస్ హౌజ్ లోకి షకీల అడుగుపెట్టింది. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో షకీలకి ఒక పవర్ ఫుల్ AV ని తీర్చిదిద్దారు మేకర్స్. అయితే రెగ్యులర్ కంటెస్టెంట్స్ కి కాస్త భిన్నంగా కొత్త కంటెంట్ కోసం షకీలాని తీసుకున్నట్టుగా తెలిసింది. షకీలాని పాజిటివ్ గా చూపించడానికి, ఫ్యామిలీ ఆడియన్స్ కి తనని దగ్గర చేయడానికి తను ఎదుర్కున్న పరిస్థితులని, అవమానాలని చూపించారు మేకర్స్. తను ఎన్నో బీ గ్రేడ్ సినిమాల్లో చేసాక తనకి చాలా అవమానాలు ఎదురయ్యాయని చెప్పింది షకీల. డబ్బుల కోసం వాళ్ళ అమ్మ మొదటిసారి షకీలాని అక్కడికి పంపించందంట. అయితే తను అప్పుడు ప్లే గర్ల్స్ అనే పిక్చర్ ఓకే అయిందంట. అదే టైమ్ లో డబ్బులకి ఇబ్బంది అవుతుందని వాళ్ళ అమ్మ పంపించిందంట. వాళ్ళ అక్కతోనే షకీలా వెళ్ళిందని ఒక ఇంటర్వూలో చెప్పింది. కాగా ఇలా తను ఇలా అవడానికి కారణమేంటి? ఎందుకిలా జరిగిందని షకీలా చాలాసార్లు చెప్పుకొని బాధపడింది. అయితే తన గురించి ఎవరికి తెలియని కొన్ని నిజాలని చూపిస్తూ, తన ఆఫ్ స్క్రీన్ లైఫ్ ఎలా ఉందని AV లో చూపించారు బిగ్ బాస్ మేకర్స్. షకీల తన గతాన్ని చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది. వాళ్ళ అక్క తనని ఎదగనివ్వకుండా చేసిందని, తను సినిమాల్లో చేస్తే వచ్చిన డబ్బులతో ఒక్క ల్యాండ్ కూడా తీసుకోకుండా చేసిందంట. ఎందుకంటే తను(షకీల) రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరిపోతుందేమోనని వాళ్ళ అక్క కావాలనే డబ్బులని ఖర్చు చేసిందంట. ఇలా తన గురించి చెప్పుకొచ్చింది షకీల.
ఒక అమ్మగా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది షకీల. అయితే షకీల ఎలిమినేట్ అయ్యాక చెన్నైకి వెళ్ళిపోయింది. హౌజ్ లో ఉన్న పన్నెండు మంది కంటెస్టెంట్స్ లో గౌతమ్ కృష్ణకి తన సపోర్ట్ ఉందంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది షకీల. నిజంగా గౌతమ్ కృష్ణని కన్న తల్లిదండ్రులు గ్రేట్ అని షకీల అంది. గౌతమ్ కృష్ణ డీసెంట్ అని, ఫేర్ గేమ్ ఆడుతున్నాడని, సపోర్ట్ అండ్ ఓట్ హిమ్ అంటూ తన పోస్ట్ లు చెప్పింది షకీల. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కి షకీల బాగా కనెక్ట్ అయ్యిన విషయం తెలిసిందే.
Also Read